Adi sankara charya books

రేపు 20/04/2018న ఆదిశంకర జయంతి. ఆదిశంకరుల వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణం ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయ పడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మ సూత్రాలను రచించి అటుతర్వాత అష్టాదశ పురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్నిచ్చి తద్వారా భగవద్గీత, సనత్ సుజాతీయం మొదలైన బ్రహ్మవిద్యా గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాసభగవానులు. కానీ కలి ప్రభావం చేత ఉన్న వైదిక మతం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదిక మతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి. ధార్మికత దెబ్బతిన్న రోజులవి, తాత్త్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతన ధర్మం క్షీణ దశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల వారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ – సృష్టిలో బ్రహ్మ తప్ప...